బంతిని స్వింగ్ చేసే సత్తా.. సిక్సర్లను సులువుగా కొట్టే బలం.. అద్భుతమైన ఫీల్డింగ్‌తో అసలైన ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌పాండ్య (Hardik Pandya) పేరు తెచ్చుకున్నాడు. కానీ గాయాలతో కొన్ని నెలలు అతడు జట్టుకు దూరమయ్యయాడు. అనంతరం జట్టులోకి వచ్చినా మునపటిలా బౌలింగ్ చేయలేదు. ఈ సీజన్ ఐపీఎల్ నుంచే బౌలింగ్ తిరిగి మొదలుపెట్టాడు. అయితే అతడు తిరిగి జట్టులోకి వచ్చే అప్పుడు ఓ కండిషన్‌తో వచ్చానని తాజాగా హార్దిక్ చెప్పాడు.
ఆల్‌రౌండర్‌గా పరిగణించే తనని జట్టులోకి తీసుకోవాలని.. కేవలం బ్యాటర్‌గా జట్టులోకి తీసుకోకూడదని సహచర ఆటగాళ్లతో చెప్పినట్లు హార్దిక్ పాండ్య తెలిపాడు. ”గాయం కారణంగా ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటూనే, కసరత్తులు చేస్తూ సన్నద్ధమయ్యా. టీమిండియా సహచరులకు ఒకటే చెప్పా. తిరిగి జట్టులోకి వచ్చానంటే ఆల్‌రౌండర్ బాధ్యతలనే స్వీకరిస్తా. లేకపోతే జట్టు తరఫున ఆడనని చెప్పేశా. అది నాకు సవాలే. అయితే అలాంటి పరిస్థితుల్లో ఆడకుండా ఉంటేనే సంతోషం. ఎందుకంటే అనవసరంగా జట్టులోకి వచ్చి మరొక ఆటగాడి స్థానాన్ని ఆక్రమించినట్లు అవుతుంది” అని హార్దిక్ పేర్కొన్నాడు.
కాగా, వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో (WIvIND) 3 ఓవర్లు బౌలింగ్ చేసిన హార్దిక్ 17 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం ఛేదనలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. ఇషాన్ కిషాన్ షాట్ ఆడగా బంతి బౌలర్ చేతికి తగిలి నాన్ స్ట్రైకర్ ఎండలో ఉన్న వికెట్లకు తగిలింది. దీంతో హార్దిక్ 5 పరుగులకే వెనుదిరిగాడు.