ముంబయి గూటికి హార్దిక్‌

స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య తిరిగి ముంబయి ఇండియన్స్‌ గూటికి చేరనున్నాడని తెలుస్తోంది. హార్దిక్‌ కోసం ముంబయి.. గుజరాత్ టైటాన్స్‌కు రూ.15 కోట్లు చెల్లించనుందని సమాచారం. అయితే దీనిపై ఇరు జట్లు ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. 2015లో ముంబయి ఇండియన్స్‌ తరఫున హార్దిక్‌ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. గత రెండు సీజన్‌ల్లో గుజరాత్‌ టైటాన్స్ తరఫున ఆడిన అతడు కెప్టెన్‌గా సూపర్‌సక్సెస్‌ అయ్యాడు. రెండు సార్లు గుజరాత్‌ను ఫైనల్‌కు చేర్చిన హార్దిక్‌ 2022 సీజన్‌లో జట్టును విజేతగా నిలిపాడు. అయితే ట్రేడింగ్‌లో ముంబయి నుంచి ఏ ఆటగాడు గుజరాత్‌కు వెళ్తాడనే విషయంపై ఆసక్తిగా మారింది. మరోవైపు హార్దిక్‌ ముంబయికి చేరితే రోహిత్ కెప్టెన్సీలో ఆడతాడా లేదా కెప్టెన్‌ బాధ్యతలు హార్దిక్‌కు ఇస్తారా అనే చర్చ మొదలైంది. ఇక గుజరాత్‌ జట్టు పగ్గాలు శుభ్‌మన్‌ గిల్‌కు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం