సెమీఫైనల్‌కు చేరిన టీమిండియాకు బిగ్‌షాక్. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య వన్డే ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన హార్దిక్ ఇప్పటికే న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. నెదర్లాండ్స్‌తో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్ అందుబాటులోకి వస్తాడని గతంలో బీసీసీఐ వర్గాలు చెప్పాయి. అతడి గాయం తీవ్రత ప్రమాదకరంగా లేదని, నాకౌట్ మ్యాచ్‌లకు తప్పక అందుబాటులోకి వస్తాడని వివరించాయి. కానీ ఇప్పుడు అతడు టోర్నీ మొత్తానికి దూరమయ్యడని ఐసీసీ ప్రకటించింది. హార్దిక్ స్థానంలో యువపేసర్ ప్రసిధ్ కృష్ణ టీమిండియాలోకి వచ్చాడని ఐసీసీ తెలిపింది.
బంగ్లా ఇన్నింగ్స్‌లో బౌలింగ్ వేస్తూ హార్దిక్ గాయపడిన సంగతి తెలిసిందే. లిటన్ దాస్ స్ట్రైయిట్ డ్రైవ్‌ను ఆపేందుకు కుడికాలితో ప్రయత్నించిన హార్దిక్ పట్టుతప్పి ఎడమకాలిపై పడిపోయాడు. కాగా, హార్దిక్ బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో రాణిస్తూ ఆల్‌రౌండర్ పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. ఇప్పుడు అతడు టోర్నీ మొత్తానికి దూరమవ్వడంతో జట్టు సమతూకం దెబ్బతినే ప్రమాదముంది.