Hardik Pandya- అయ్యో హార్దిక్‌.. మరిన్ని మ్యాచ్‌లకు దూరం!

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ప్రపంచకప్‌లో మరిన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నడాని తెలుస్తోంది. బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో గాయం కారణంగా ఆట మధ్యలోనే మైదానాన్ని వీడిన హార్దిక్‌.. ఆదివారం జరిగిన న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. అయితే హార్దిక్‌ అక్టోబర్ 29న ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ గతంలో వెల్లడించింది. కానీ ఇంగ్లాండ్‌ మ్యాచ్‌తో పాటు శ్రీలంక పోరుకు కూడా అతడు దూరమవుతున్నట్లు సమాచారం. నాకౌట్ మ్యాచ్‌లను దృష్టిలో పెట్టుకొని హార్దిక్‌ విషయంలో రిస్క్‌ తీసుకోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో బౌలింగ్ వేస్తూ హార్దిక్‌ గాయపడిన సంగతి తెలిసిందే. లిటన్ దాస్‌ స్ట్రైయిట్ డ్రైవ్‌ను ఆపేందుకు కుడికాలితో ప్రయత్నించిన హార్దిక్‌ పట్టుతప్పి ఎడమకాలిపై పడిపోయాడు.

ప్రస్తుతం హార్దిక్‌ పాండ్య వేగంగా కోలుకుంటున్నాడు. అయితే గురువారం అతడికి ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అతడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తేనే జట్టులోకి తీసుకోవాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తుంది. బంతి, బ్యాటుతో రాణించే హార్దిక్‌ మెగాటోర్నీలో జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంటాడు. ఈ నేపథ్యంలో లీగ్‌ మ్యాచ్‌ల్లో అతడికి కావాల్సిన విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం