ముంబయికి వచ్చేస్తున్నా.. హార్దిక్‌ ఎమోషనల్‌

ఐపీఎల్‌ ఆట స్టార్ట్‌ కాకముందే క్రికెట్ ఫ్యాన్స్‌కు ‘ప్లేయర్స్‌ ట్రేడింగ్‌ వార్తల’తో ఫుల్‌ మజా వస్తుంది. గుజరాత్ టైటాన్స్‌ను రెండు సార్లు ఫైనల్స్‌కు చేర్చడమేగాక, 2022లో విజేతగా కూడా నిలిపిన హార్దిక్ పాండ్య.. తిరిగి ముంబయి ఇండియన్స్‌ గూటికి చేరాడు. దీంతో హార్దిక్‌ ఇన్‌స్టాలో ఎమోషనల్‌ పోస్ట్ పెట్టాడు. ఐపీఎల్‌ వేలంలో తొలిసారిగా తనని కొనుగోలు చేస్తున్న ముంబయి ఫ్రాంచైజీ వీడియోతో పాటు.. ఆ జట్టుతో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ ఓ వీడియో హార్దిక్‌ పోస్ట్ చేశాడు. ”ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ముంబయి, వాంఖడే, పల్టాన్.. ఇలా ప్రతీది ప్రత్యేకమే. వెనక్కి తిరిగి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది’’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చాడు. 2015లో ముంబయి ఇండియన్స్‌ తరఫున హార్దిక్‌ ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే వన్డే వరల్డ్‌కప్‌లో గాయపడి టోర్నీకి దూరమైన హార్దిక్‌ ప్రస్తుతం కోలుకుంటున్నాడు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం