Hardik Pandya- అయ్యో హార్దిక్‌.. ఇంకెప్పుడు వస్తావ్‌?

వన్డే వరల్డ్‌కప్‌లో మరో రెండు మ్యాచ్‌లకు టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య దూరమవుతున్నట్లు తెలుస్తోంది. గురువారం శ్రీలంకతో జరగనున్న మ్యాచ్‌తో పాటు దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు కూడా అతడు అందుబాటులో ఉండడని సమాచారం. అయితే దీని గురించి బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ వేస్తూ హార్దిక్‌ గాయపడిన సంగతి తెలిసిందే. లిటన్ దాస్‌ స్ట్రైయిట్ డ్రైవ్‌ను ఆపేందుకు కుడికాలితో ప్రయత్నించిన హార్దిక్‌ పట్టుతప్పి ఎడమకాలిపై పడిపోయాడు. దీంతో చీలమండకు గాయమై నొప్పితో మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత జరిగిన న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే నెదర్లాండ్స్ తో జరిగే ఆఖరి లీగ్‌ మ్యాచ్‌కు పాండ్య అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు భారత్‌ ప్రపంచకప్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి విజయపరంపర కొనసాగిస్తోంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం