exams
Home » ఎగ్జామ్‌ అయిపోయిన ఏడేళ్లకు హాల్‌టికెట్‌

ఎగ్జామ్‌ అయిపోయిన ఏడేళ్లకు హాల్‌టికెట్‌

by admin
0 comment

పశ్చిమ బెంగాల్‌లో ఓ వ్యక్తికి వింత పరిస్థితి ఎదురైంది. ఏడేళ్ల క్రితం తాను దరఖాస్తు చేసుకున్న ఓ ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షకు ఇప్పుడు హాల్‌ టికెట్‌ రావడంతో అతడు కంగుతిన్నాడు. అది కూడా ఎగ్జామ్‌ పూర్తి అయిన ఏడేళ్లకు రావడం గమనార్హం. ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ 2016లో అసిస్టెంట్‌ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ నిర్వహించింది. ఈ పరీక్షకు వర్ధమాన్‌ జిల్లాకు చెందిన ఆశిష్‌ బెనర్జీ అనే అభ్యర్థి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత అతడికి దాని నుంచి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. కానీ ఈ నెల 1న దానికి సంబంధించిన అడ్మిట్‌కార్డ్‌ రావడంతో షాక్‌కు గురయ్యాడు. హాల్‌టికెట్‌ ఆలస్యమవడానికి కారణమేంటో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశాడు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని తెలిపాడు. బెంగాల్‌లో ఇటీవల పలు ఉద్యోగ నియామక కుంభకోణాలు వెలుగుచూశాయి. తాజాగా ఈ ఘటన చోటుచేసుకోవడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links