RTC బిల్లుకు గవర్నర్‌ గ్రీన్‌ సిగ్నల్‌

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లుపై ఉత్కంఠ వీడింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఉన్నతాధికారులతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే విషయంపై ప్రభుత్వం కాసేపట్లో క్లారిటీ ఇవ్వనుంది.

కాగా, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని జులై 31న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అయితే ఇది మనీ బిల్లు కావడంతో గవర్నర్‌ అనుమతి కోసం ఈనెల 2న మధ్యాహ్నం ముసాయిదా బిల్లును రాజ్‌భవన్‌కు పంపారు. దీనిపై కొన్ని సందేహాలను వ్యక్తంచేస్తూ గవర్నర్‌ కార్యాలయం వివరణ కోరగా, ప్రభుత్వం వాటికి సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..