1.5K
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకటించిన నివేదికలో భారత్‌కు 111వ స్థానం లభించింది. ప్రపంచవ్యాప్తంగా 125 దేశాలను పరిగణలోకి తీసుకొని నివేదిక ఇచ్చారు. 28.7 స్కోరుతో భారత్‌లో ఆకలి తీవ్రత స్థాయి ఎక్కువగా ఉన్నట్లు ఈ సూచీ వెల్లడించింది. ప్రపంచ బాలల్లో అత్యధికంగా మన దేశంలో 18.7 శాతం తక్కువ బరువు ఉన్న పిల్లలు ఉన్నారని, పోషకాహార లోపాన్ని సూచిస్తోందని నివేదిక పేర్కొంది. గతేడాది ఇదే నివేదికలో 121 దేశాలకుగాను భారత్‌కు 107వ స్థానం దక్కింది. అయితే ఇది తప్పుడు నివేదికగా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. వాస్తవ పరిస్థితికి ఈ నివేదిక అద్దం పట్టడం లేదని, లోపభూయిష్టమైన ‘ఆకలి’ కొలతలతో ఇది రూపొందినట్లు కేంద్ర ప్రభుత్వం ఖండించింది. పాక్ 102, బంగ్లాదేశ్ 81, నేపాల్ 69, శ్రీలంక 60 ర్యాంకులు సాధించాయి.