Glenn Maxwell- మాక్సీ విశ్వరూపం..40 బంతుల్లో శతకం: ఆసీస్‌ 399/8

నెదర్లాండ్స్‌పై మాక్స్‌వెల్ విశ్వరూపం చూపించాడు. 40 బంతుల్లో మెరుపు శతకం బాదాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 46.2 ఓవర్ల సమయానికి అర్ధశతకం అందుకున్న మాక్సీ.. 48.4 ఓవర్లకు ఏకంగా సెంచరీ సాధించాడు. 2.2 ఓవర్ల గ్యాప్‌లోనే హాఫ్‌ సెంచరీ నుంచి సెంచరీకి చేరుకున్నాడు. ఈ క్రమంలో ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. మాక్సీతో పాటు డేవిడ్‌ వార్నర్‌ (104) కూడా శతకం సాధించడంతో ఆస్ట్రేలియా 8 వికెట్లు కోల్పోయి 399 పరుగులు చేసింది.

దిల్లీ వేదికగా నెదర్లాండ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు శుభారంభం లభించలేదు. ఆదిలోనే మిచెల్ మార్ష్(9) ఔటవ్వంతో 28 పరుగులకే ఆసీస్‌ తొలివికెట్ కోల్పోయింది. అయితే స్టీవ్ స్మిత్ (71), లబుషేన్‌ (62)తో కలిసి వార్నర్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. వారిద్దరితో వరుసగా 132, 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అలాగే ప్రపంచకప్ లో వరుసగా రెండో సెంచరీ కూడా సాధించాడు. అయితే ఆ తర్వాత నెదర్లాండ్స్‌ బౌలర్లు పుంజుకొని స్కోరుబోర్డును 268/5కు కట్టడిచేశారు. ఆ దశలో ఆసీస్‌ 330 స్కోరు సాధిస్తుందని అంతా అంచనా వేశారు. కానీ మాక్సీ రాకతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. వరుసగా బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన మాక్సీ తర్వాతి 14 బంతులకు మరో 50 పరుగులు చేశాడు. అతడి దెబ్బకి 48, 49 ఓవర్లలో 21, 28 పరుగులు వచ్చాయి.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం