ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ తండ్రయ్యాడు. అతడి భార్య వినీ రామన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. తమ బాబుకు ‘లొగాన్ మావెరిక్ మ్యాక్స్‌వెల్’గా పేరు పెట్టారు. వినీ రామన్ భారతీయ యువతి. తమిళనాడుకు చెందిన ఆమె ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఫార్మసిస్ట్‌గా పనిచేశారు. ఈ క్రమంలో వారి మధ్య పరిచయం ఏర్పడింది. తర్వాత ప్రేమికులుగా మారారు. గతేడాది మార్చిలో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అయితే ఇటీవల వినీ సీమంతాన్ని మాక్సీ భారతీయ సంప్రదాయంలో ఘనంగా నిర్వహించాడు. కాగా, పేరెంట్స్ అయిన ఆ జంటకు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.