gaganyan
Home » Gaganyaan తొలి అడుగు- TV-D1 పరీక్ష విజయం

Gaganyaan తొలి అడుగు- TV-D1 పరీక్ష విజయం

by admin
0 comment

భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్‌ ప్రాజెక్టులో కీలక ప్రయోగం టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌ (TV-D1)ను ఇస్రో విజయవంతంగా చేపట్టింది. రీషెడ్యూల్‌ చేయడంతో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ఇవాళ ఉదయం 10 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగంలో భాగంగా క్రూ మాడ్యుల్‌ను సురక్షితంగా కిందకి దించారు. 17 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్‌ మాడ్యూల్‌, క్రూ మాడ్యూల్‌ పరస్పరం విడిపోయాయి. ఆ తర్వాత డ్రోగ్‌ పారాచూట్లు విచ్చుకొని బంగాళాఖాతంలో దిగాయి. ఈ TV-D1 విజయంతో గగన్‌యాన్‌ కోసం ఇస్రో మరింత రెట్టింపు ఉత్సాహంతో సన్నద్ధం కానుంది.

అయితే షెడ్యూల్‌ ప్రకారం ఈ ప్రయోగం ఉదయం 8 గంటలకు నిర్వహించాల్సి ఉంది. వాతావరణం అనూకూలించక 8.45 నిమిషాలకు రీషెడ్యూల్‌ చేశారు. కానీ, సాంకేతిక లోపం కారణంగా చివరి నిమిషంలో ఈ వాహననౌక పరీక్షను నిలిపివేశారు. అయితే సాంకేతిక సమస్యను శాస్త్రవేత్తలు గుర్తించడంతో, తిరిగి ప్రయోగాన్ని చేపట్టారు. ఈ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైంది.

2025లో నిర్వహించే గగన్‌యాన్‌లో ముగ్గురు వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి ఇస్రో పంపనున్న విషయం తెలిసిందే. మూడు రోజుల తర్వాత వ్యోమగాములను తిరిగి భూమికి రప్పిస్తుంది. ఈ ప్రయోగంలో భాగంగా కొన్ని కీలక పరిజ్ఞానాలపై కొన్నేళ్లుగా ఇస్రో కసరత్తు చేస్తోంది. ఇప్పుడు వాటిని గగనతలంలో పరీక్షించనుంది. మొదటగా టీవీ-డీ1 పరీక్షను నిర్వహించింది. ఇందులో క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ సమర్థత, క్రూ మాడ్యూల్‌ పనితీరు, వ్యోమనౌకను క్షేమంగా కిందకి తెచ్చే డిసలరేషన్‌ వ్యవస్థ పటిష్ఠతను పరిశీలించింది. అలాగే సాగర జలాల్లో పడే క్రూ మాడ్యూల్‌ను సేకరించి, తీరానికి చేర్చే కసరత్తునూ పరీక్షించింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links