Gaganyaan- షెడ్యూల్‌ మార్పు.. 10 గంటలకు TV-D1 పరీక్ష

భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్‌ ప్రాజెక్టులో కీలక ప్రయోగం టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌ (TV-D1) ఇవాళ ఉదయం 10 గంటలకు చేపట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 8 గంటలకు నిర్వహించాల్సి ఉంది. అయితే వాతావరణం అనూకూలించక తొలుత 8.45 నిమిషాలకు రీషెడ్యూల్‌ చేశారు. కానీ, సాంకేతిక లోపం కారణంగా చివరి నిమిషంలో ఈ వాహననౌక పరీక్షను ఇస్రో నిలిపివేసింది. అయితే సాంకేతిక సమస్యను శాస్త్రవేత్తలు గుర్తించడంతో, తిరిగి ప్రయోగాన్ని చేపడుతున్నట్లు ట్విటర్‌ వేదికగా తెలిపింది. ఈ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైంది.

2025లో నిర్వహించే గగన్‌యాన్‌లో ముగ్గురు వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి ఇస్రో పంపనున్న విషయం తెలిసిందే. మూడు రోజుల తర్వాత వ్యోమగాములను తిరిగి భూమికి రప్పిస్తుంది. ఈ ప్రయోగంలో భాగంగా కొన్ని కీలక పరిజ్ఞానాలపై కొన్నేళ్లుగా ఇస్రో కసరత్తు చేస్తోంది. ఇప్పుడు వాటిని గగనతలంలో పరీక్షించనుంది. మొదటగా టీవీ-డీ1 పరీక్షను నిర్వహిస్తోంది. ఇందులో క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ సమర్థత, క్రూ మాడ్యూల్‌ పనితీరు, వ్యోమనౌకను క్షేమంగా కిందకి తెచ్చే డిసలరేషన్‌ వ్యవస్థ పటిష్ఠతను పరిశీలిస్తుంది. అలాగే సాగర జలాల్లో పడే క్రూ మాడ్యూల్‌ను సేకరించి, తీరానికి చేర్చే కసరత్తునూ పరీక్షిస్తుంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం