Aditya L1- తొలి అడుగు విజయం

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన ఆదిత్య-ఎల్‌1 (Aditya L1) లక్ష్యం దిశగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. తొలి భూకక్ష్య పెంపు విన్యాసాన్ని ఆదివారం విజయవంతంగా నిర్వహించింది. ఈ విషయాన్ని ఇస్రో ట్విటర్‌ వేదికగా వెల్లించింది. బెంగళూరులోని ‘ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ (ISTRAC)’ నుంచి ఈ ప్రక్రియను చేపట్టినట్లు తెలిపింది. ఆదిత్య-ఎల్‌1 ఇప్పుడు 245× 22,459 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి ప్రవేశించిందని ప్రకటించింది. మిషన్‌ అంతా సజావుగా సాగుతోందని, రెండో భూకక్ష్య పెంపు విన్యాసాన్ని సెప్టెంబరు 5న తెల్లవారుజామున 3 గంటలకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

కాగా, దేశ తొలి సౌర పరిశీలన ఉపగ్రహం ‘ఆదిత్య-ఎల్‌ 1’ను నిర్దేశిత భూ కక్ష్యలోకి ఇస్రో శనివారం విజయవంతంగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌ రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహాన్ని తీసుకుని నింగిలోకి దూసుకెళ్లింది. 63 నిమిషాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం 1480.7 కిలోల ఉపగ్రహాన్ని భూ కక్ష్యలో ప్రవేశపెట్టింది. 16 రోజుల పాటు భూ కక్ష్యల్లోనే చక్కర్లు కొట్టనుంది. అనంతరం భూమికి 15 లక్షల కి.మీ. దూరంలో ఉన్న నిర్దేశిత ఎల్‌1 బిందువు దిశగా సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అయితే భారత వ్యోమనౌక సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్‌, క్రోమో స్పియర్‌ సహా వెలుపల ఉండే కరోనానూ అధ్యయనం చేస్తాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి ఎన్నో అంశాలను శోధిస్తాయి.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం