‘ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడిగా మహారాష్ట్రకు చెందిన భరత్ జైన్ నిలిచాడు. అతడు నెలకు రూ. 7 కోట్లు సంపాదిస్తాడు. అతడి కింద 18వేల బిచ్చగాళ్లు పనిచేస్తున్నారు. వారు సంపాదించే దానిలో 20% వాటాను పొందుతాడు. బొంబాయిలో 8 విల్లాలు, 18 అపార్ట్‌మెంట్‌లు, 2 ఇండిపెండెట్ బంగ్లాలు ఉన్నాయి. అతడు ఐఐఎమ్ కోల్‌కతాలో డిగ్రీ పట్టా కూడా పొందాడు. అయితే ఇటీవల రూ.22 కోట్ల విలువ కలిగిన ఇంటిని కొనుగోలు చేస్తూ ఐటీ అధికారులకు దొరికడంతో అతడి విషయం బయటకు వచ్చింది. అంతేగాక అతడు మలేషియా, ఇండోనేషియా దేశాల్లోని యాచకుల మాఫియాతో సంబంధాలు ఉన్నాయి’ అని ఇటీవల సామాజకి మాధ్యమాల్లో వార్త చక్కర్లు కొడుతోంది.
భరత్ బిచ్చగాడు అనేది వాస్తవమే. కానీ అతడి సంపాదన నెలకు రూ.7 కోట్లు కాదు. ఇటీవల జాతీయ మీడియాలో అతడి గురించి స్పష్టంగా వార్తలు వచ్చాయి. యాచక వృత్తిలోనే రూ.7 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించాడు. నెలకు రూ.60 నుంచి రూ.70 వేల వరకు సంపాదిస్తాడు. ముంబయిలో రూ. 1.2 కోట్ల విలువ కలిగిన ఇల్లు, రెండు షాప్లు కూడా ఉన్నాయి. ఈ రిచ్ బిచ్చగాడు ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఇతర ప్రముఖ ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. కానీ ఐఐఎమ్ కోల్‌కతా డిగ్రీ పట్టా పొందాడనేది అవాస్తవం. అయితే యాచిస్తూ భరత్ రూ.7 కోట్లు సంపాదించడం విశేషం.