గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసేటప్పుడు.. గ్యాస్ లీక్ అవుతుందో లేదో అనో లేక బరువును చెక్ చేస్తుంటాం. కానీ, సిలిండర్ ఎక్స్‌పైరీ డేట్‌ను ఎప్పుడైనా చెక్ చేశారా? అది ఎక్కడ ఉంటుందంటే.. సిలిండర్ పై భాగంలో పట్టుకునేందుకు గుండ్రటి హ్యాండిల్ ఉంటుంది. దానికి, సపోర్టెడ్‌గా మూడు ప్లేట్స్ ఉంటాయి. ఈ ప్లేట్లపై లోపలి వైపు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. A-12, B-23, C-15, D-28.. అలా వివిధ నంబర్లతో ఉంటాయి. A అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి. B అంటే ఏప్రిల్, మే, జూన్. ఇక C అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్. అలాగే D అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఉదాహరణకు సిలిండర్‌పై A-24 అని రాసి ఉంటే, గడువు 2024 సంవత్సరంలో జనవరి నుంచి మార్చి మధ్య ముగుస్తుందని అర్థం. ఈ విధంగా సిలిండర్ ఎక్స్‌పైరీ డేట్‌ను తెలుసుకోవచ్చు. సాధారణంగా LPG గ్యాస్ సిలిండర్ లైఫ్ టైమ్ 15 ఇయర్స్.