EasyJet – విమానం గాల్లో ఉండగా.. టాయిలెట్లో ఓ జంట నిర్వాకం

విమానాల్లో కొందరి ప్రవర్తన తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయడం ఇటీవల తరచూ వార్తల్లో చూస్తున్నాం. తాజాగా ఈజీజెట్‌ (EasyJet) సంస్థకు చెందిన విమానం గాల్లో ఉండగా ఓ జంట టాయిలెట్లోకి వెళ్లి అభ్యంతరకర స్థితిలో దొరికిపోయింది. బ్రిటన్‌లోని లూటన్‌ నుంచి ఇబిజాకు వెళుతున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణం మధ్యలో ఓ జంట టాయిలెట్లోకి వెళ్లి గడియ వేసుకుంది. ఎంతసేపైనా వారు బయటకు రాకపోవడంతో సిబ్బందిలో ఒకరు తలుపు తెరవమని కోరారు. ఆ జంట ఏ మాత్రం స్పందించలేదు. దీంతో సిబ్బంది బలవంతంగా తలుపు తెరవాల్సి వచ్చింది. లోపల కనిపించిన దృశ్యాన్ని చూసి సిబ్బంది సహా అందరూ అవాక్కయ్యారు. ప్రయాణికుల్లో ఒకరు ఇదంతా వీడియో తీశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. విమానం ఇబిజాలో దిగగానే ఆ జంటను పోలీసులకు అప్పగించినట్లు ఈజీజెట్‌ సంస్థ తెలిపింది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..