balakrishna
Home » Dussehra- దసరా విన్నర్‌ బాలయ్యేనా?

Dussehra- దసరా విన్నర్‌ బాలయ్యేనా?

by admin
0 comment

మ్యాడ్ ఆల్రెడీ థియేటర్లలో నడుస్తోంది. దసరాకు భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో సినిమాలొచ్చాయి. అటు బాలీవుడ్ లో గణపత్ రిలీజైంది. మరి వీటిలో దసరా విన్నర్ ఎవరు? ఫస్ట్ వీకెండ్ ముగియడంతో దసరా విన్నర్ ఎవరనేది తేలిపోయింది. రిలీజై 4 రోజులు పూర్తి చేసుకుంది భగవంత్ కేసరి సినిమా. బాలయ్య హీరోగా నటించిన ఈ సినిమాకు 39 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చింది. రెండో రోజు పడిపోయినప్పటికీ, ఆ తర్వాత ఈ సినిమా పుంజుకుంది. సిసలైన దసరా విన్నర్ గా నిలబడాలంటే ఈ సినిమా ఈ వీకెండ్ కూడా గట్టిగా ఆడాలి.

ఇక లియో సినిమా యూత్ ను ఆకట్టుకున్నప్పటికీ, పండగ సినిమా అనిపించుకోలేకపోయింది. వినోదం లేకపోవడం, హింస ఎక్కువగా ఉండడంతో ఫ్యామిలీస్ దీనికి దూరమయ్యారు. తెలుగులో మిక్స్ డ్ రెస్పాన్స్ రాబట్టుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ పెద్ద హిట్టయింది. టైగర్ నాగేశ్వరరావు తొలి రోజే ఫ్లాప్ అయింది. దసరా బరిలో భారీ అంచనాలతో దిగిన ఈ సినిమా, భారీ రన్ టైమ్, వీక్ సెకెండాఫ్ వల్ల కోలుకోలేకపోయింది. ఇక దసరా బరిలో నిలిచిన బాలీవుడ్ మూవీ గణపత్, డిజాస్టర్ అయింది. ఓవరాల్ గా దసరా సినిమాల్లో భగవంత్ కేసరి మాత్రమే నిలబడింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links