పాకిస్థాన్‌కు వేరే పని లేదా?- గంభీర్‌

ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్‌ ఓటమిపాలవ్వడంపై పాకిస్థాన్‌ జట్టు ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకోవడాన్ని గౌతం గంభీర్‌ తీవ్రంగా ఖండించాడు. ”అభిమాన జట్టు గెలిస్తే సెలబ్రేషన్స్‌ చేసుకోవాలి. అంతేకానీ ఇతర జట్లు ఓడిపోతే అలా చేయడమేంటి? అది మేనర్స్‌ కాదు, నెగెటివ్‌ యాటిట్యూడ్‌. ఈ విధానాన్ని వీడాలి. ఎట్‌లీస్ట్‌ స్పోర్ట్స్‌ రిలేటెడ్‌ విషయాల్లోనైనా ఇలా ఉండకూడదు. అయినా అలా చేస్తే ఏం యూజ్‌ ఉంటుంది? వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ ఉంటుంది. ఆ టైమ్‌కు భారత్‌-పాకిస్థాన్‌ తలపడతాయి. అప్పుడు ఎవరో ఒకరు గెలుస్తారు. ఆ టైమ్‌కు చేసుకుంటే ఓ అర్థముంటుంది. కానీ ఇలా ఇతర టీమ్స్‌ ఓడిపోవడంపై సంబరాలు ఎప్పటికీ చేయకూడదు” అని పాక్‌ అభిమానులను ఉద్దేశించి గంభీర్‌ మాట్లాడాడు. అలాగే ఇతర జట్ల చేతిలో పాకిస్థాన్‌ ఓడిపోయినప్పుడు టీమిండియా ఫ్యాన్స్‌ కూడా పాక్‌ను ట్రోల్‌ చేయొద్దని అన్నాడు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం