కోహ్లిని అలా అనలేదు-మీడియాపై గంభీర్‌ ఫైర్‌

టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌.. ప్రముఖ వార్త సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాక్స్‌వెల్‌ డబుల్‌ సెంచరీ ఇన్నింగ్స్‌పై గంభీర్‌ మాట్లాడాడని, మాక్సీ స్థానంలో కోహ్లి ఉంటే.. 195 స్కోరు తర్వాత కేవలం సింగిల్సే తీసేవాడని, భారీ షాట్లు ఆడేవాడు కాదని.. విరాట్‌ను గంభీర్‌ తీవ్రంగా విమర్శించినట్లుగా.. ఆ వార్త సంస్థ రాసుకొచ్చింది. దీనిపై గంభీర్ ట్విటర్‌ వేదికగా రియాక్ట్ అయ్యాడు. ”ఎప్పుడైనా ఏమైనా చెప్పాలని భావిస్తే ఓపెన్‌గా చెప్పేస్తా. ఆ వ్యాఖ్యలు చేశానని నిరూపించండి లేదా క్షమాపణలు చెప్పండి” అని ఫైర్‌ అయ్యాడు. దీంతో సదరు వార్త సంస్థ గంభీర్‌కు సారీ చెప్పింది. దానికి గంభీర్ బదులిస్తూ.. డబ్బుని సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయని, ఇలాంటి న్యూస్‌ రాయొద్దని మీడియాను కోరాడు.

క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ఇచ్చిన అనంతరం గంభీర్‌ వ్యాఖ్యాతగా మారాడు. టీమ్స్‌, ప్లేయర్స్‌ల బలాబలాలు గురించి విశ్లేషిస్తుంటాడు. అయితే ఐపీఎల్‌లో కోహ్లి-గంభీర్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఎదురయ్యాయి. బెంగళూరు-లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌ అనంతరం ప్లేయర్లు షేక్‌ హ్యాండ్‌ చేసుకునే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గంభీర్‌తో పాటు లక్నో ఆటగాడు నవీనుల్ సైతం విరాట్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ విషయం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రపంచకప్‌లో నవీనుల్‌-కోహ్లి కలిసిపోవడంతో ఈ ఫైట్‌కు ముగింపు లభించింది. మరోవైపు గంభీర్‌ సైతం కోహ్లి ఇన్నింగ్స్‌లపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం