Delhi: ఐఫోన్‌ కోసం రోడ్డుపై ఈడ్చుకెళ్లి..

దేశ రాజధాని దిల్లీ (Delhi)లో దారుణం చోటు చేసుకుంది. ఐఫోన్‌ను చోరీ చేసేందుకు ఇద్దరు దుండగులు ఓ మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. రోడ్డుపై ఈడ్చుకెళ్లి ఫోన్‌ను దొంగలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాధితురాలు యొవికా చౌదరి దక్షిణ దిల్లీలోని జ్ఞాన్​ భారతి పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి ఆమె ఆటోలో ఇంటికి పయనమయ్యారు. అయితే​ ఆమె వద్ద ఉన్న ఐఫోన్‌ను గమనించిన దుండగులు దానిని చోరీ చేసేందుకు ఓ ప్లాన్‌ వేశారు. ఆటోలో వెళ్తోన్న ఆమెను రెండు బైక్‌లపై వెంబడించి ఫోన్‌ను లాక్కోవాలని యత్నించారు.

కానీ యొవికా ప్రతిఘటించడం వల్ల జరిగిన పెనుగులాటలో ఆమె ఆటో నుంచి కిందపడిపోయారు. అక్కడితో వదలని దుండగలు ఆ ఫోన్‌ కోసం ఆమెను రోడ్డుపై అలాగే ఈడ్చుకెళ్లారు. వారితో పోరాడలేని ఆమె ఫోన్‌ను వదిలేయడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో ఆమె ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..