పాక్‌పై వార్నర్‌ ‘పుష్ప’ సెలబ్రేషన్స్‌.. ఆసీస్‌ 367/9

బెంగళూరు వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పరుగుల వరద పారించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ తొమ్మిది వికెట్లు కోల్పోయి 367 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (163), మిచెల్ మార్ష్‌ (121) భారీ శతకాలతో కదం తొక్కారు. 203 బంతుల్లోనే 259 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరూ వరుస బంతుల్లో శతకాలు అందుకోవడం విశేషం. 85 బంతుల్లోనే వార్నర్‌ శతకం సాధించగా, బర్త్‌డే బాయ్‌ మార్ష్‌.. సెంచరీ మార్క్‌కు 100 బంతులు తీసుకున్నాడు. వీరిద్దరు 24 ఫోర్లు, 18 సిక్సర్లు బాదారు. అయితే ఈ జోడీ జోరును చూసి ఆసీస్‌ 400 పరుగుల మార్క్‌ను సులువుగా దాటేలా కనిపించింది. కానీ షాహీన్‌ అఫ్రిది అయిదు వికెట్లు సాధించడంతో స్కోరు వేగం తగ్గింది. చివరి అయిదు ఓవర్లలో ఆస్ట్రేలియా 37 పరుగులే చేసి 5 వికెట్లు కోల్పోవడం గమనార్హం.

వార్నర్‌ అయిదో ఓవర్‌లోనే ఔట్‌ అయ్యే పరిస్థితి ఏర్పడింది. షాహీన్‌ అఫ్రిది బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి బంతిని గాల్లోకి లేపాడు. కానీ ఉసామ్‌ మిర్‌ ఆ సులువైన క్యాచ్‌ను వదిలిపెట్టాడు. తర్వాత వార్నర్‌ చెలరేగిపోయాడు. సెంచరీ సెలబ్రేషన్స్‌ ‘అల్లు అర్జున్ పుష్ప’ స్టైయిల్‌లో చేయడం విశేషం. ఇక 150 మార్క్‌ను వార్నర్ సిక్సర్‌తో అందుకున్నాడు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం