gill
Home » గిల్‌తో డేటింగ్.. రిప్లై ఇచ్చిన సారా

గిల్‌తో డేటింగ్.. రిప్లై ఇచ్చిన సారా

by admin
0 comment

టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ సారాతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే అందరికీ ఓ కన్ఫ్యూయిజన్‌. నటి సారా అలీఖాన్‌తో గిల్‌ డేటింగ్‌లో ఉన్నాడా లేదా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ గారాలపట్టి అయిన సారాతో లవ్‌లో ఉన్నాడా అనేది చాలామందికి క్లారిటీ లేదు. అయితే గిల్‌ తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై నటి సారా అలీఖాన్ స్పందించింది. కాఫీ విత్‌ కరణ్ షోలో.. గిల్‌ తో డేటింగ్‌ ఉన్నట్లు వస్తున్న కథనాలపై బదులివ్వాలని సారాను కరణ్‌ ప్రశ్నించాడు. అయితే ఆ సారా తాను కాదని, తప్పుగా అర్థం చేసుకుంటున్నారని సారా అలీఖాన్‌ ఆన్సర్‌ చేసింది. అలాగే ప్రపంచం మొత్తం ‘రాంగ్‌ సారా’ వెనుక పడుతోందని ఆమె తెలిపింది. గిల్‌తో తాను రిలేషన్‌లో లేనట్టు చెబుతూనే, సారా టెండుల్కర్‌ రిలేషన్‌లో ఉండొచ్చేమోనని ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చింది.

గిల్‌-సారా టెండుల్కర్‌ ప్రేమలో ఉన్నట్లు చాలా సార్లు కథనాలు వచ్చాయి. అయితే కొన్ని నెలల నుంచి ఆ వార్తలకు కాస్త బ్రేక్‌ పడింది. కానీ ఇప్పుడు మళ్లీ ఆ వార్తలు ఊపందుకున్నాయి. దానికి కారణం వన్డే వరల్డ్‌కప్‌. ఈ మెగాటోర్నీలో టీమిండియా మ్యాచ్‌లు వీక్షించడానికి సారా కూడా వస్తుంది. అయితే గిల్ బౌండరీలు సాధించినప్పుడల్లా సారా అమితానందంలో ఉంటుంది. ఆ టైంలో కెమెరామెన్‌ కూడా ఆమెపై ఫోకస్‌ చేయడం కొసమెరుపు.

రీసెంట్‌గా వీరిద్దరు ముంబైలోని ఓ హోటల్‌లో కలిసి కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా కూడా మారింది. హోటల్‌ నుంచి బయటకు గిల్‌ ఫస్ట్ వచ్చాడు. కానీ సారా మాత్రం ఎంట్రెన్స్‌లో కాసేపు నిలబడి ఉంది. అంతేగాక టీమిండియా ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో గిల్‌ను ఉద్దేశిస్తూ ఆడియన్స్‌ ‘సారా సారా’ అంటూ నినాదాలు చేశారు. ఈ టైంలో కోహ్లి రియాక్ట్‌ అయ్యి.. అలా చేయొద్దని ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేశాడు. అయితే ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తలపై గిల్‌, సారా టెండుల్కర్‌ ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links