Bengaluru: రూ.1.14 కోట్లు కాజేసిన కిలేడి

పెళ్లి ముసుగులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఓ మహిళ బురిడీ కొట్టింది. వివాహ వేదిక ద్వారా పరిచయమై ఏకంగా రూ. 1.14 కోట్లు కాజేసింది. ఈ ఘటన బెంగళూరులో (Bengaluru) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లండన్‌లోని ఓ సంస్థలో పని చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి శిక్షణలో భాగంగా బెంగళూరు వచ్చాడు. ఇక్కడే పెళ్లిచేసుకోవాలనే ఆలోచనతో ఓ ప్రైవేట్‌ వివాహ వేదికలో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఆయనకు పరిచయమైంది. కొన్ని రోజులు చాటింగ్‌ చేసిన తర్వాత తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని ఆమె.. అతడి వద్ద నుంచి రూ.1500 తీసుకుంది.

రెండు రోజుల తర్వాత ఆమె.. ఆయనకు కాల్‌ చేసింది. నగ్నంగా వీడియో కాల్‌ మాట్లాడింది. ఇదంతా రికార్డు చేసి తర్వాత రోజు అతడికి వాట్సాప్‌లో షేర్‌ చేసింది. వాటిని చూసి కంగుతిన్న అతడు.. ఆమె బెదిరింపులకు లొంగిపోయాడు. ఈ క్రమంలో ఆమె డిమాండ్‌ చేస్తూ రూ.1.14 కోట్లు కాజేసింది. ఇంకా కావాలంటూ ఆమె ఒత్తిడి చేయడంతో స్థానిక వైట్‌ఫీల్డ్‌ పోలీస్‌స్టేష్‌న్‌లో అతడు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసు అధికారులు ఆమె ఖాతాలో ఉన్న రూ.80 లక్షలు డ్రా చేసుకోకుండా కట్టడి చేశారు. పరారీలో ఉన్న మహిళ ఆచూకి కోసం వెతుకుతున్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..