Chiranjeevi: భోళాశంకర్ మొదటి రోజు వసూళ్లు

ఓ పెద్ద సినిమాకు ఆటోమేటిగ్గా హైప్ వస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతాయి, ఓపెనింగ్స్ భారీగా వస్తాయి. ఇక మెగాస్టార్ సినిమా గురించి చెప్పేదేముంది.. థియేటర్లు దద్దరిల్లాలి, బాక్సాఫీస్ బద్దలవ్వాలి. కానీ ఆశ్చర్యంగా భోళాశంకర్ కు అలాంటివేం జరగలేదు. మొదటి రోజు ఈ సినిమాకు అటుఇటుగా 60 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే కనిపించింది. ఇక రెవెన్యూ లెక్కల్లో చెప్పాలంటే, మొదటి రోజు కేవలం 20శాతం మాత్రమే రికవర్ అయింది ఈ సినిమా. 80 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన భోళాశంకర్ సినిమాకు, మొదటి రోజు 22 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే వచ్చింది. దీనికితోడు సినిమాకు మొదటి రోజే నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో భోళాశంకర్ బ్రేక్ ఈవెన్ అవుతుందా అవ్వదా అనేది ఇప్పుడో పెద్ద డౌట్ గా మారింది.

చిరంజీవి ప్రీవియస్ మూవీ వాల్తేరు వీరయ్య పెద్ద హిట్టయింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా తాజాగా 200 రోజుల పండగ కూడా చేసుకుంది. దీంతో భోళాశంకర్ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు ఆడియన్స్. కానీ ఆ అంచనాల్ని ఏ స్థాయిలో అందుకోలేకపోయింది చిరు సినిమా. దీనికితోడు నాసిరకం కామెడీ సినిమాను మరింత నీరసంగా మార్చేసింది. చిరంజీవిపై ఉన్న గౌరవం-ప్రేమ-ఇష్టంతో అసహనం వ్యక్తం చేస్తున్న ఆడియన్స్, మెహర్ రమేష్ ను మాత్రం ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. రెండు డిఫరెంట్ షేడ్స్ లో చిరంజీవి నటించిన ఈ సినిమాలో ఆయన సరసన హీరోయిన్ గా తమన్న నటించగా, చిరు చెల్లెలిగా కీర్తిసురేష్ కనిపించింది. మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మాతగా 120 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది భోళాశంకర్ సినిమా.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం