చైనాలో మరో మంత్రి మిస్సింగ్. రక్షణశాఖ మంత్రి లీ షాంగ్ఫు ఆచూకీ గల్లంతైంది. ఇటీవల బీజింగ్‌లో జరిగిన సదస్సు తర్వాత ఆయన ఏ బహిరంగ కార్యక్రమంలోనూ కనిపించలేదు. ధిక్కార స్వరాన్ని వినిపించిన వారిని చైనా ప్రభుత్వం అణచివేస్తుంటుంది. ఈ క్రమంలో వారు అదృశ్యమవుతుంటారు. ఇప్పుడు జిన్‌పింగ్ సొంత ప్రభుత్వంలోని మంత్రులే అదృశ్యమవుతున్నారు. ఇటీవల విదేశాంగ మంత్రి చిన్‌గాంగ్ అదృశ్యమయ్యారు. ఆ తర్వాత సైన్యంలోని రాకెట్ ఫోర్స్‌కు చెందిన ఇద్దరు కమాండర్ల జాడ లేదు. తాజాగా రక్షణశాఖ మంత్రి మిస్సింగ్ అంటూ వార్తలు వచ్చాయి. హార్డ్‌వేర్ కొనుగోలు అవినీతి కేసులపై విచారణ జరుగుతున్న సమయంలో ఇది చోటుచేసుకుంది. ఈ కేసులపై 2017 నుంచి దర్యాప్తు చేస్తున్నట్లు చైనా సైన్యం వెల్లడించింది.