China- 25 ఏళ్లలోపు పెళ్లిచేసుకుంటే ఆఫర్‌

జననాల రేటు తగ్గిపోతుండటంతో ‘చైనా’ (China) చర్యలు చేపట్టింది. పిల్లలను కనేలా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా వధువులకు జెజియాంగ్ రాష్ట్రంలోని చాంగ్షాన్‌ కమిటీ ఆఫర్‌ ప్రకటించింది. 25 ఏళ్లలోపు పెళ్లిచేసుకుంటే వధువులకు ఆ దేశ కరెన్సీ వెయ్యి యువాన్లు ఇవ్వనుంది. అయితే మొదటి వివాహం చేసుకునే వారే ఈ రివార్డుకు అర్హులుగా ప్రకటించింది. ఆ తర్వాత కూడా పిల్లల సంరక్షణ, విద్య విషయంలోనూ సబ్సీడీలు ఇచ్చి జంటలకు ఆర్థికంగా సహకరించనుంది. చైనాలో కనీస వివాహ వయస్సు మహిళలకు 20, పురుషులకు 22గా ఉంది.

మరోవైపు పెళ్లి చేసుకునే జంటల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటంపై చైనా కలవరపడుతోంది. చైనా పౌర సంబంధాల వ్యవహారాల మంత్రిత్వశాఖ 2022 గణాంకాలు విడుదల చేసింది. 2021తో పోలిస్తే.. 2022లో వివాహం చేసుకునే వారి సంఖ్య 10.5 శాతం తగ్గిపోయింది. 2021లో 7.63 మిలియన్ల జంటలు వివాహం చేసుకోగా, 2022లో 6.8మిలియన్ల జంటలు మాత్రమే పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలిపింది. 1986 నుంచి ఇప్పటివరకు చైనాలో నమోదైన వివాహాల్లో గతేడాది అతి తక్కువ వివాహాలు జరిగినట్లు వెల్లడించింది. అలాగే సంతానోత్పత్తి రేటు 2022లో 1.09కి పడిపోయిందని గణాంకాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో స్థానిక ప్రభుత్వాలు వేగంగా చర్యలు చేపడుతున్నాయి.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం