చంద్రునికి చేరువగా చంద్రయాన్-3 (Chandrayaan-3) పయనిస్తోంది. మరోసారి విజయవంతంగా కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని భారత వ్యోమనౌక చేపట్టిన్నట్లు బుధవారం ఇస్రో ప్రకటించింది. ఈ విన్యాసంతో కక్ష్య తగ్గింపు ప్రక్రియలన్ని పూర్తయ్యాయని, వ్యోమనౌక కక్ష్యను 153 కి.మీ. x 163 కి.మీ.లకు తగ్గించినట్లు తెలిపింది. ప్రస్తుతం చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి చేరింది. జాబిల్లి చుట్టూ చక్కర్లు కొట్టేందుకు ఇదే చివరి కక్ష్య.
కాగా, గురువారం వ్యోమనౌకలోకి ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయే ప్రక్రియను చేపడతారు. అది సజావుగా జరిగితే ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయి సొంతంగా జాబిల్లిని చుట్టేస్తుంది. అంతా సజావుగా సాగితే ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టనుందని ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్-3ని జులై 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే.