Viral video- కారుకు ప్రమాదం.. కానీ మందు బాటిళ్లు ముఖ్యం

మద్యం నిషేధం కొనసాగుతున్న బిహార్‌లో ఓ కారు ప్రమాదానికి గురైంది. అయితే కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లు ఉన్నాయి. ప్రమాదం అనంతరం సాయం చేసేందుకు వెళ్లిన అక్కడి స్థానికులు.. కారులో మందు బాటిళ్లను గుర్తించారు. ఆ తర్వాత స్థానికులు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా.. బాటిళ్లను తీసుకొని పరుగులు పెట్టారు. సాధ్యమైనన్నీ బాటిల్స్‌ను అందుకొని పరిగెత్తారు. ఈ నేపథ్యంలో రోడ్‌పై గందరగోళ వాతావరణం నెలకొని ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. మద్యం బాటిళ్లను అక్రమంగా తరలించిన వారితోపాటు, వాటిని తీసుకువెళ్లిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2016 నుంచి బిహార్‌లో మద్యం నిషేధం కొనసాగుతోంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం