హైదరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరాలి- అమిత్‌ షా

తెలంగాణలో డబుల్‌ ఇంజిన్ సర్కార్‌ రావాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, డిసెంబర్‌ 3న హైదరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరాలని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన జనగర్జన సభలో పాల్గొన్న అమిత్‌షా మాట్లాడారు. ”కృష్ణా ట్రైబ్యునల్‌ నిబంధనలు మార్చి మోదీ.. తెలంగాణకు నీటి ఇబ్బంది లేకుండా చేశారు. గత పదేళ్లుగా సీఎం కేసీఆర్‌ తెలంగాణ పేదల సమస్యలు తీర్చలేదు. రైతులు, దళితులు, గిరిజనులను పట్టించుకోలేదు. కేసీఆర్‌ వైఖరి కారణంగా గిరిజన వర్సిటీ ఏర్పాటు ఆలస్యమైంది. గిరిజన వర్సిటీకి రాష్ట్ర సర్కారు జాగా చూపించలేదు, అందుకే ఆలస్యమైంది. కేసీఆర్‌ గిరిజనుల కోసం ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ అమలు చేయలేదు. ఆదివాసీలకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామన్నారు, కానీ ఇవ్వలేదు. దళితులు, గిరిజనుల కోసం మోదీ తొమ్మిదేళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఒడిశాలో పుట్టిన నిరుపేద గిరిజన మహిళను మోదీ రాష్ట్రపతిని చేశారు. కేసీఆర్‌ మాత్రం పదేళ్లుగా తన కుటుంబం గురించే ఆలోచిస్తున్నారు” అని అమిత్‌షా అన్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..