Shocking: చనిపోయిన పదేళ్లకు రూ.7 కోట్ల టాక్స్‌ నోటీస్‌!

మరణించి పదేళ్లు గడిచాక ఓ మహిళకు రూ.7 కోట్ల పన్ను కట్టాలని నోటీసులు వచ్చాయి. ఇదే షాకింగ్ ఘటన అనుకుంటే, నెలకు కేవలం రూ.5వేలు సంపాదిస్తున్న మరో వ్యక్తికి రూ1.25 కోట్లు టాక్స్‌ చెల్లించాలని ఐటీ డిపార్ట్‌మెంట్ నోటీసులు అందజేసింది. ఈ విచిత్ర సంఘటనలు మధ్యప్రదేశ్‌లోని బెతుల్‌ జిల్లాలో చోటు చేసుకున్నాయి.

వివరాళ్లోకి వెళ్తే.. ఉషా సోని అనే మహిళ సుమారు పది సంవత్సరాల క్రితం 2013లోనే చనిపోయారు. కానీ ఇటీవల ఆమె పేరుతో ఐటీ శాఖ వారి నుంచి ఓ నోటీసు వచ్చింది. ప్రభుత్వానికి సుమారు రూ.7. కోట్లు పన్ను చెల్లించాలని నోటీసులో ఉండటంతో కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. నితిన్ జైన్ అనే మరోవ్యక్తికి కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. నెలకు 5 వేల వరకు సంపాదించే సామర్థ్యం గల ఆ వ్యక్తికి రూ.1.25 పన్ను వసూలుకు సంబంధించిన నోటీసులు వచ్చాయి.

దీంతో నితిన్‌ జైన్‌ అధికారులను సంప్రదించగా షాకింగ్‌ విషయాలు బయటకు వచ్చాయి. ”ఐటీ నోటీసులు రావడంతో అధికారులను సంప్రదించా. నా పేరుపై తమిళనాడులో ఓ ఫేక్‌ అకౌంట్‌ ఉందని, రూ. లక్షల్లో లావాదేవీలు జరిగాయని చెప్పారు. దాంతో నాకు నోటీసులు వచ్చాయని పేర్కొన్నారు” అని నితిన్‌ వెల్లడించారు. బెతుల్‌ జిల్లాలో ఇలాంటి ఉదంతాలు మరికొన్ని ఉండటంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం