‘గూగుల్‌’ని నమ్మారు- చివరికి ఎడారిలో..

టెక్నాలజీపై ఆధారపడిన కొందరు.. చివరికి ఎడారిలో సాయం కోసం ఎదురుచూపులు చూశారు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. అసలేం జరిగిందంటే.. లాస్‌ వేగాస్‌ నుంచి లాస్‌ ఏంజెలెస్‌ బయలుదేరిన షెల్బీ ఎస్లెర్‌, ఆమె ఫ్రెండ్స్‌.. తొందరగా ఇళ్లకు తిరిగివెళ్లాలని గూగుల్‌ మ్యాప్‌ను ఆశ్రయించారు. ప్రయాణం మొదలుపెట్టగానే గూగుల్‌ నావిగేషన్‌ వారికి ఓ షార్ట్‌కట్‌ను చూపింది. ఓ 50 నిమిషాల ప్రయాణం కలిసొస్తుందని షెల్బీ గ్రూప్‌ అటే వెళదామని నిర్ణయించుకొంది. అయితే ఆ మార్గంలో వెళ్లగా వెళ్లగా.. చివరికి నెవాడా ఎడారిలోకి చేరుకున్నారు. వారి వాహనాలు ఇసుకలో కూరుకుపోయాయి. అంతకుముందు మార్గమధ్యంలో ఓ ట్రక్కు డ్రైవరు ఎదురై.. అటువైపు రోడ్డు లేదని చెప్పినా వినకుండా గూగుల్‌ మ్యాప్‌ను నమ్ముకొని.. అందరూ ఇరుక్కుపోయారు. చివరకు ఒక టోయింగ్‌ ట్రక్కుకు కాల్‌ చేసి ఎడారి నుంచి బయటపడ్డారు. ఈ ఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నట్లు గూగుల్‌ వెల్లడించింది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం