సాధారణంగా పబ్లిక్ టాయిలెట్స్‌ను ఉపయోగిస్తే మనమే డబ్బులివ్వాల్సి ఉంటుంది. కానీ దక్షిణ కొరియాలోని UNIST యూనివర్సిటీలో టాయ్‌లెట్‌కు వెళ్తే వారే తిరిగి డబ్బులిస్తారు. ‘చో జే వీన్’ అనే యూనిర్సిటీ ప్రొఫెసర్ మలంతో విద్యుత్ శక్తి, మీథేన్ గ్యాస్‌ను తయారుచేసే కొత్త రకమైన బీవీ టాయ్‌లెట్‌ను రూపొందించారు. దీనిలో కొన్ని రకాల సూక్ష్మజీవులు మలాన్ని మీథేన్‌గా మారుస్తాయి. దాన్ని విద్యుత్‌గా, ఘన ఆక్సైడ్ ఇంధనంగానూ మార్చుకోవచ్చు. అంతేగాక మలం నుంచి మీథేన్‌ను వేరు చేసిన తర్వాత దాన్ని ఎరువుగా ఉపయోగిస్తారు. అయితే టాయ్‌లెట్‌ను ఉపయోగించుకున్నందుకు వారు వర్చువల్ కరెన్సీ ఇస్తారు. వాటిని అక్కడ క్యాంటీన్‌లో వినియోగించుకోవచ్చు.