Meenakshi Lekhi ‘మీ ఇంటికి ఈడీ వస్తుంది’ కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

లోక్‌సభలో కేంద్రమంత్రి మీనాక్షి లేఖి (Meenakshi Lekhi) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు’ గురించి గురువారం చర్చ జరుగుతున్న సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. విపక్ష నేతలను ఉద్దేశించి మీ ఇంటికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌ (ఈడీ) వస్తుందని ఆమె హెచ్చరించారు.

‘దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు’పై లోక్‌సభలో చర్చ జరుగుతుండగా బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. అధికార పక్ష సభ్యులు మాట్లాడుతుండగా విపక్ష ఎంపీలు గట్టిగట్టిగా నినాదాలు చేశారు. దీనిపై మీనాక్షి లేఖి స్పందిస్తూ ”నిశ్శబ్దంగా ఉండండి. లేదంటే మీ ఇళ్లకు ఈడీ అధికారులు రావాల్సి ఉంటుంది” అని ఆమె హెచ్చరించారు. దీనిపై వివక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని తాము చెప్పిన మాటలు ఇప్పుడు రుజువయ్యాయని విపక్షాలు దుయ్యబట్టాయి.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం