Virat Kohli: కోహ్లి పోస్ట్‌తోనే బీసీసీఐ చర్యలు?

ఫిట్‌నెస్‌ లెవల్‌ను మెయిన్‌టైన్ చేయడంలో టీమిండియా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) స్టైలే వేరు. అతడిని ఆదర్శంగా తీసుకునే ఎంతో మంది క్రికెటర్లు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపిస్తున్నారంటే అతియోశక్తి కాదు. మైదానంలోనే చిరుతలా విరాట్‌ కదులుతుంటాడు. అయితే ఇటీవల తన యోయో టెస్ట్‌ స్కోరు గురించి ఇన్‌స్టాలో అతడు పోస్ట్‌ చేశాడు. 17.2 స్కోరు వచ్చిందని గురువారం అభిమానులతో పంచుకున్నాడు. అయితే దీనిపై బీసీసీఐ (BCCI) ఆటగాళ్లను హెచ్చరించిందని సమాచారం. సోషల్‌ మీడియాలో ఇలాంటి అఫిషియల్ మేటర్స్‌ చెప్పొద్దని తెలియజేసిందని తెలుస్తోంది. ఇది కాంట్రాక్ట్‌ క్లాజ్‌ ధిక్కరణ కిందకు వస్తుందని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

‘‘సోషల్ మీడియాలో ఇలాంటి అధికారిక విషయాలను వెల్లడించవద్దు. తమ శిక్షణ సందర్భంగా దిగిన ఫొటోలను కొందరు పోస్టు చేస్తున్నారు. అదేవిధంగా టెస్టుల స్కోరుకు సంబంధించిన విషయాలను కూడా పంచుకుంటున్నారు. ఇది కాంట్రాక్ట్‌ క్లాజ్‌ ధిక్కరణ కిందకు వస్తుంది. ఇలాంటివి చేయొద్దని మౌఖింగా ఆదేశాలు ఇచ్చాం’’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం టీమిండియా ఆసియాకప్‌ కోసం సన్నద్ధమవుతోంది. ఈ నెల 30 నుంచి ఆసియా కప్‌ ప్రారంభం కానుంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం