Bapatla:పోలీసుల సాహసానికి సెల్యూట్‌.. ప్రాణాలు కాపాడారు

సముద్రంలో కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులను పోలీసు సిబ్బంది కాపాడారు. ప్రమాదాన్ని వెంటనే గుర్తించి పోలీసులు సాహసం చేయడంతో ఎవరికీ ప్రాణ హాని కలగలేదు. ఈ సంఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కర్నూలుకు చెందిన పుల్లేటి మహేష్‌, గోగుల రమణ ఆదివారం సాయంత్రం బాపట్ల బీచ్‌కు వచ్చారు. ఇతర యాత్రికులతో కలిసి సముద్ర తీరాన్ని ఆస్వాదిస్తుండగా పెద్ద అలల తాకిడికి సముద్రంలోకి వెళ్లిపోయారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది దీన్ని గమనించి హుటాహుటిన సముద్రంలోకి వెళ్లి యాత్రికులను కాపాడారు. అనంతరం వారిక ప్రథమ చికిత్స అందించారు. దీంతో బీచ్‌లోని యాత్రికులంతా పోలీస్‌ సిబ్బంది చూపిన తెగువకు సెల్యూట్ చేశారు. మరోవైపు యాత్రికుల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్న జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌కు కూడా కృజ్ఞతలు తెలియజేశారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం