VIDEO: అసిఫాబాద్‌లో ‘బాహుబలి సీన్‌’

కుమురం భీం అసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలంలోని అన్నార్పల్లి గ్రామపంచాయతీ పరిధిలో బాహుబలి సీన్‌ రిపీట్‌ అయ్యింది. శివగామి వాగులో కొట్టుకుపోతూ ఒంటిచేత్తో చంటిబిడ్డను పైకి పట్టుకొని రక్షించిన సీన్‌ తరహాలో ఓ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

వివరాళ్లోకి వెళ్తే.. లక్మాపూర్‌లో కవిత, పవన్‌ దంపతుల ఏడాది వయసున్న కుమారుడికి రెండు రోజులుగా జ్వరం వస్తోంది. వీరు ఆసుపత్రికి వెళ్లాలంటే లక్మాపూర్‌ వాగు దాటాలి. దీనిపై వంతెనలు లేవు. వాగు నిండుగా ప్రవహిస్తుండడంతో ఆదివారం దగ్గరి బంధువు సహాయంతో ఏడాది కుమారుడిని చేతులతో పైకి ఎత్తి పట్టుకొని వాగు దాటించి.. కెరమెరకి తీసుకెళ్లి వైద్యం చేయించారు. సోమవారం ప్రవాహం కొంచెం తగ్గగా దంపతులు ఒకరినొకరు పట్టుకొని కుమారుడితో సహా జాగ్రత్తగా వాగు దాటి గ్రామానికి చేరుకున్నారు. కాగా, వాగు ఉద్ధృతి పెరిగిన సందర్భాల్లో మండల కేంద్రంతో పాటు జిల్లా కేంద్రానికి సంబంధాలు పూర్తిగా తెగిపోతాయని గ్రామస్తులు వాపోతున్నారు. వంతెన పూర్తి చేసి తమ కష్టాలు తొలగించాలని అన్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..