Baby- బేబీ కాంబో రిపీట్‌.. బేబీ-2 వస్తుందా?

ఈ ఇయర్ టాలీవుడ్ కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది “బేబి” సినిమా. యూత్ ను ఆకట్టుకుని ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. కెరీర్ లో తొలిసారి బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో టేస్ట్ చేశారు. అలా సూపర్ హిట్ జోడీగా నిలిచిన ఈ జంట, ఇప్పుడు మరోసారి కలిసింది.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా మాస్ మూవీ మేకర్స్, అమృతా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఓ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాతో బేబి యూనిట్ అంతా దాదాపు రిపీట్ అవుతోంది. “బేబి” సినిమాను యూత్ ఫుల్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా రూపొందించి మెగాస్టార్ చిరంజీవి నుంచి సాధారణ ప్రేక్షకుల దాకా అందరి ప్రశంసలు అందుకున్న దర్శకుడు సాయి రాజేశ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే,మాటలు అందిస్తున్నాడు. ఈ సినిమాకు ఎస్ కేఎన్ తో కలిసి సాయి రాజేష్ ప్రొడ్యూసర్ గానూ వ్యవహరిస్తున్నాడు. అలా బేబి ఇచ్చిన కిక్ తో ఎస్కేఎన్ కూడా ఈ ప్రాజెక్టులోకి జాయిన్ అయ్యాడు.

ఇక బేబి సినిమాకు అద్భుతమైన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన విజయ్ బుల్గానిన్, ఈ సినిమాకు కూడా సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. ఆల్రెడీ అతడు తన వర్క్ కూడా స్టార్ట్ చేశాడు.

నూతన దర్శకుడు రవి నంబూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. వచ్చే సమ్మర్ లో థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. బేబి సినిమా టైపులో ఈ సినిమా కూడా బోల్డ్ గా ఉంటుందా, లేక మరో డిఫరెంట్ జానర్ లో వస్తుందా అనేది త్వరలోనే తెలుస్తోంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం