HCA- అజహరుద్దీన్‌పై అనర్హత వేటు

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) ఎన్నికల్లో పోటీ చేయకుండా మహ్మద్‌ అజహరుద్దీన్‌పై అనర్హత వేటు పడింది. జస్టిస్‌ లావు నాగేశ్వరరావు కమిటీ అతడిపై అనర్హత వేటు వేసింది. గతంలో ఏకకాలంలో HCA, డెక్కన్‌ బ్లూస్‌ క్లబ్‌ అధ్యక్షుడిగా అజహరుద్దీన్‌ వ్యవహరించారు. HCA అధ్యక్షుడిగా ఉండి నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ మేరకుHCA ఓటరు జాబితా నుంచి అజహరుద్దీన్‌ పేరును తొలగించారు.

కాగా, HCA ఎన్నికలకు గత నెల 30న నోటిఫికేషన్‌ విడుదలైంది. HCA ఎన్నికల అధికారి వీఎస్‌ సంపత్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. HCA అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారి, ఈసీ పోస్టులకు అక్టోబర్‌ 11 నుంచి 13 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 14న నామినేషన్లను పరిశీలించనున్నారు. అక్టోబర్‌ 16వ తేదీ లోపు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు. 20న పోలింగ్‌ నిర్వహించి అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడించనున్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం