నెదర్లాండ్స్‌పై ఆసీస్‌ రికార్డు విజయం

నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా 309 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. అంతేగాక ఇప్పటివరకు నెగటివ్‌ నెట్‌రన్‌రేటుతో ఉన్న ఆ జట్టు పాజిటివ్‌(+1.142) లోకి వెళ్లి టాప్‌-4లో నిలిచింది. దిల్లీ వేదికగా జరిగిన ఈ వన్డేలో టాస్ గెలిచిన ఆసీస్‌ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఎనిమిది వికెట్లు కోల్పోయి 399 పరుగులు చేసింది. మాక్స్‌వెల్ విశ్వరూపం చూపించాడు. 40 బంతుల్లో మెరుపు శతకం బాదాడు. ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. మాక్సీతో పాటు డేవిడ్‌ వార్నర్‌ (104) కూడా శతకం సాధించాడు. స్టీవ్ స్మిత్ (71), లబుషేన్‌ (62) రాణించారు.

అనంతరం భారీ ఛేదనకు దిగిన నెదర్లాండ్స్‌ 21 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. 3 ఓవర్లు వేసి 8 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. మిచెల్ మార్ష్‌ రెండు వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్‌, హేజిల్‌వుడ్‌, కమిన్స్‌ తలో వికెట్ తీశారు. ఇక నెదర్లాండ్స్‌ బ్యాటర్లలో విక్రమ్‌జిత్ సింగ్‌ (25) టాప్‌ స్కోరర్. ముగ్గురు డచ్ బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరిగారు. ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును మాక్స్‌వెల్ అందుకున్నాడు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం