South Africa Fire Accident- 63 మంది సజీవదహనం

దక్షిణాఫ్రికా(South Africa)లోని జొహన్నెస్‌బర్గ్‌(Johannesburg)లో పెను విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌లో ఉన్న అతిపెద్ద రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 63 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 43 మంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై కారణాలు తెలియలేదు. అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ భవనంలో దాదాపు 200 మంది నివాసముంటున్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

బిల్డింగ్‌ నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చినా, దట్టమైన పొగ అలుముకొని సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. కాగా, నిరాశ్రయులు ఎలాంటి లీజ్‌ అగ్రిమెంట్లు లేకుండానే ఈ భవనంలో నివాసముంటున్నారని ఎమర్జెన్సీ అధికారులు తెలిపారు. అందువల్ల భవనంలో చిక్కుకుపోయిన వారిని వెతకడం కష్టంగా మారిందని వెల్లడించారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీగా ప్రాణనష్టం సంభవించిందని పేర్కొన్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..