Assam పోలీసులకు పరీక్ష: ఫిట్‌గా లేకపోతే ఔట్‌.. డీజీపీతో సహా!

పోలీసు ఉద్యోగం సాధించాలంటే రాత పరీక్షతో పాటు ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో తప్పక పాస్‌ అవ్వాలి. ఒక్కసారి సెలక్ట్‌ అయిన తర్వాత ఫిట్‌నెస్‌ గురించి పోలీసులు పెద్దగా పట్టించుకోరు. దాంతో కొందరు భారీకాయంతో ఉంటుంటారు. ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదని అసోం (Assam) ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం రాష్ట్ర పోలీసులందరికీ ఎత్తు,బరువులు కొలుస్తామని తెలిపింది. ఎత్తుకు తగిన బరువు మించి ఉంటే కఠిన చర్యలు తప్పవని ప్రకటించింది. దానికి కొన్ని నెలల సమయం కూడా ఇచ్చింది. దీనికి రాష్ట్ర డీజీపీకి కూడా మినహాయింపు లేదు.

ఆగస్టు 15తో గడువు ముగియడంతో కొన్ని రోజుల నుంచి పోలీసులకు ఫిట్‌నెస్‌ సర్వే నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 36 చోట్ల ఈ నెల చివరి వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే బాడీ మాస్‌ ఇండెక్స్‌ (BMI) 30, అంతకుకు మించి ఉన్నవారికి ప్రత్యేక ట్రైనింగ్‌ ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. నవంబర్‌లోపు ఆ ట్రైనింగ్‌లో BMIని 30లోపు తగ్గించుకోవాలని చెప్పారు. విఫలమైతే వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. థైరాయిడ్‌, మరికొన్ని సమస్యలతో బాధపడుతున్నవారికి మినహాయింపు ఇచ్చారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం