ASIAN GAMES- చరిత్ర సృష్టించిన భారత్‌

ఆసియన్‌ గేమ్స్‌లో భారత్‌ అథ్లెటిక్స్‌ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. పతకాల వేట కొనసాగిస్తూ చరిత్ర సృష్టించారు. ఇప్పటికీ 74 పతకాలు సాధించిన ఇండియా.. ఆసియా క్రీడల్లో తమ అత్యుత్తమ ప్రదర్శనగా రికార్డు సృష్టించింది. గతంలో 2018లో జకర్తాలో జరిగిన క్రీడల్లో సాధించిన 70 పతకాలే అత్యధికంగా ఉండేవి. ఇప్పుడు ఈ రికార్డు బద్దలైంది. 11వ రోజు ఆటలో భారత్‌ ఒక స్వర్ణం, ఒక రజతం, మూడు కాంస్య పతకాలు సాధించింది. ఆర్చ‌రీ మిక్స్‌డ్ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ, ఓజాస్ టీమ్ గోల్డ్‌ సాధించారు. ఈ క్రీడ‌ల్లో భార‌త్‌కు ఇది 16వ స్వ‌ర్ణం కావ‌డం విశేషం. అయితే పసిడి సాధిస్తుందనుకున్న స్టార్‌ బాక్సర్‌ లవ్లీనా తుదిపోరులో ఓటమిపాలైంది. రజతం సాధించి, పారిస్‌ ఒలింపిక్స్‌ కోటా బెర్తును దక్కించుకుంది. 75కేజీల బౌట్ ఫైన‌ల్లో చైనా బాక్స‌ర్ లీ క్వియాన్ చేతిలో ఓట‌మిపాలైంది.

35 కిలోమీటర్ల రేస్‌ వాక్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో భారత్‌ కాంస్యం సాధించింది. రామ్‌, మంజు రాణి జట్టు పతకాన్ని సాధించింది. స్క్వాష్‌ మిక్సడ్‌ డబుల్స్‌లో అన్హత్‌ సింగ్‌, అభయ్‌ సింగ్‌ జట్టు కాంస్యం సాధించింది. బాక్సింగ్‌ 57 కేజీల మహిళా విభాగంలో ప్రవీణ హుడా కాంస్యం సాధించింది.

మరోవైపు భారత్‌ హాకీ పురుషుల జట్టు, స్క్వాష్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ దిపికా పల్లికల్‌, హరిందర్‌పాల్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. హాకీలో కొరియాను 5-3 గోల్స్‌ తేడాతో చిత్తుచేసి తుదిపోరుకు చేరింది. ఇక బ్యాడ్మింటన్‌లో స్టార్‌ ప్లేయర్‌ పీవీ సింధు ఉమెన్స్‌ సింగిల్స్‌లో, హెచ్‌ ఎస్‌ ప్రణోయ్‌ మెన్స్‌ సింగిల్స్‌లో, సాత్విక్‌-చిరాగ్‌ జోడి మెన్స్‌ డబుల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం