ఆసియాకప్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఓటమిపై ఆ జట్టు బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ స్పందించాడు. తమ స్పిన్నర్లు మ్యాచ్ విన్నర్లు అని, కానీ టీమిండియా మ్యాచ్‌లో తేలిపోయారని అన్నాడు. ఓటమితో నిరుత్సాహ పడ్డామని, ప్రపంచకప్‌నకు ముందు ఇది మాకో గుణపాఠం అని తెలిపాడు. అయితే మ్యాచ్‌లో భారత బ్యాటర్లకు ఫుల్ క్రెడిట్ దక్కుతుందని, మొదటి నుంచి తమ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారని పేర్కొన్నాడు.
గాయంతో ఆసియాకప్‌కు నసీమ్ షా దూరమవ్వడంపై మోర్కెల్ మాట్లాడాడు. అతడు అందుబాటులో లేకపోవడంపై తమకు ఎదురు దెబ్బే అని, కానీ కొత్తగా జట్టులోకి వచ్చే వారికి ఇది అద్భుతమైన అవకాశమని అన్నాడు. భారత్ చేతిలో ఓటమి చవిచూడటంతో శ్రీలంకపై కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాని తెలిపాడు. శ్రీలంకతో మ్యాచ్ గెలిస్తే పాక్ జట్టు టీమిండియాతో ఆదివారం ఫైనల్ ఆడుతుంది. ఒకవేళ శ్రీలంక చేతిలో ఓటమిపాలైనా, వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయినా లంక జట్టే తుదిపోరుకు అర్హత సాధిస్తుంది.