PAK ప్లేయర్‌కు Ashwin సూచన- అందుకే హెల్మెంట్ అవసరం

ఆసియాకప్‌ సమరం స్టార్ట్ అయ్యింది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, నేపాల్ తలపడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 342 పరుగులు చేసింది. బాబర్‌ అజామ్‌ (151), ఇఫ్తికర్‌ (109) సెంచరీలు సాధించారు. అయితే ఓపెనర్‌ రిజ్వాన్‌ 5 పరుగుల వద్ద రనౌటయ్యాడు. అయితే రిజ్వాన్‌ ఔటైన తీరుపై నెట్టింట్లో ట్రోల్స్‌ వస్తున్నాయి. నిర్లక్ష్యంగా పరిగెత్తి రనౌటయ్యాడని, బద్ధకం ఎందుకని క్రికెట్‌ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

అయితే టీమిండియా సీనియర్‌ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ రనౌట్‌పై విశ్లేషించాడు. రిజ్వాన్‌ నిర్లక్ష్యంగా పరిగెత్తడానికి కారణం హెల్మెట్‌ ధరించకపోవడమేనని తెలిపాడు. ”త్రో విసిరిన బంతి నుంచి రిజ్వాన్ త‌ప్పించుకోలేక‌పోయాడు. అలాంటి సందర్భాల్లో చాలామంది వికెట్ కాపాడుకునేందుకు డైవ్ చేస్తారు. కానీ, రిజ్వాన్ అలా చేయ‌లేదు. బంతి ఎక్క‌డ త‌న త‌ల‌కు త‌గులుతుందేమోననే భ‌యంతో క‌నిపించాడు. అందుకు కార‌ణం ఏంటంటే అత‌డు హెల్మెట్ పెట్టుకోలేదు. రిజ్వాన్ స్వీప్ షాట్లు ఆడేందుకు ఇష్ట‌ప‌డ‌తాడు. కానీ హెల్మెట్ లేక‌పోవ‌డం అత‌డిని ర‌నౌట్ అయ్యేలా చేసింది” అని అశ్విన్ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు.

పాక్‌-నేపాల్‌ మ్యాచ్‌లో 23వ ఓవ‌ర్‌లో సందీప్ ల‌మిచానే బౌలింగ్‌లో రిజ్వాన్ బౌండ‌రీ బాదాడు. ఆ త‌ర్వాత బంతిని ఆఫ్ సైడ్ ఆడి సింగిల్ తీసేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే అక్క‌డ ఉన్న ఫీల్డ‌ర్ దీపేంద‌ర్‌ బంతిని అందుకొని వేగంగా బౌల‌ర్ వైపు విసిరాడు. అదంతా గ‌మ‌నించిన రిజ్వాన్ క్రీజులో బ్యాట్ పెట్ట‌కుండా జంప్ చేశాడు. బంతి నేరుగా వికెట్ల‌కు తాకింది. అప్ప‌టికీ అత‌ను గాల్లోనే ఉన్నాడు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం