వివాదంలో ఏఆర్‌ రెహమాన్‌

ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే విడుదలైన ‘పిప్పా’ చిత్రానికి రెహమాన్‌ సంగీతం అందించారు. ఈ చిత్రంలో దివంగత బెంగాలీ కవి కాజీ నజ్రుల్‌ ఇస్లాం రచించిన దేశ భక్తి గీతం ‘కరార్‌ ఓయ్‌ లౌహో కోపట్‌’ను వాడుకున్నారు. అయితే రెహమాన్‌ ఈ గీతం ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా మార్పులు చేసి తన సినిమాకు వాడుకున్నారని నజ్రుల్‌ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ‘రెహమాన్‌ అడగడంతో ఎలాంటి మార్పులు చేయకుండా ఆ గీతాన్ని సినిమాలో వాడుకునేందుకు అనుమతించాం. కనీసం టైటిల్స్‌లో మాకు కృతజ్ఞతలు చెప్పలేదు. కానీ ఆయన ఒరిజినల్‌ట్యూన్‌ను మార్చారు. పాట ఆత్మను చంపేశారు. వెంటనే ఆ గీతాన్ని సినిమా నుంచి తొలగించాలి’ అని నజ్రుల్‌ మనవడు అనిర్భన్‌ డిమాండ్‌ చేశారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం