mahesh
Home » Sitara- సితార మనసుకు ఫిదా.. వీడియో వైరల్‌

Sitara- సితార మనసుకు ఫిదా.. వీడియో వైరల్‌

by admin
0 comment

స్టార్ హీరో మహేశ్‌బాబు కుమారై సితారకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఓ వృద్ధురాలికి ఆమె చేసిన సాయానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఓ షాపింగ్‌ మాల్‌లో అతిపెద్ద బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. దీని ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహేశ్‌ భార్య నమత్ర, కుమార్తె సితార పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాపింగ్‌ మాల్‌ నిర్వాహకులు పలువురు పేద వృద్ధులు, మహిళలకు బహుమతులు అందజేశారు. అయితే బహుమతి అందుకోవడం కోసం స్టేజ్‌పైకి ఎక్కడానికి ఇబ్బందిపడిన ఓ వృద్ధురాలికి సితార సాయం చేసింది. చేయి పట్టుకుని ఆమెను స్టేజ్‌పైకి తీసుకువచ్చింది. తర్వాత అక్కడి వారందరితో సరదాగా మాట్లాడుతూ ఫొటోలు దిగింది. దీంతో సితార మంచి మనసుకు మురిసిపోయిన ఓ వృద్ధురాలు అపురూపంగా ఆమెను ముద్దుపెట్టుకున్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links