వయసును దృష్టిలో పెట్టుకొని ఎవరైనా తనని బాబాయ్ అంటే దబిడి దిబిడే అని నందమూరి బాలకృష్ణ సరదాగా వార్నింగ్ ఇచ్చాడు. భగవంత్ కేసరి’ బాక్సాఫీస్ కా షేర్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ”వయసులో నన్నెవడైనా బాబాయ్ అనో, ఇంకేమైనా పిలిస్తే.. జాగ్రత్తగా ఉండండి.. దబిడిదిబిగే అని అంటుంటా.. అయినప్పటికీ ఈ సినిమాలో శ్రీలీలకి చిచ్చాగా చేశాను. ఇక సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు వేసే దమ్ము, ధైర్యం.. అభిమానుల మీద నమ్మకం.. మా నాన్న గారు ఇచ్చిన వారసత్వం. అలాగే నా సినిమాలకు నా సినిమాలే పోటీ” అంటూ తన ఫ్యాన్స్‌తో సందడి చేశాడు బాలకృష్ణ. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం భగవంత్ కేసరి. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చిన నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో వేడుక నిర్వహించింది.