విరాట్ కోహ్లి మరోసారి తండ్రి కాబోతున్నాడని, అతడి భార్య అనుష్క శర్మ మళ్లీ గర్భం దాల్చిందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అవి ఎంతవరకు నిజం అని క్లారిటీలేదు. కానీ ఇప్పుడు అనుష్క బేబీ బంప్‌తో స్పష్టంగా కనిపించింది. బెంగళూరులో విరుష్క నడుస్తూ కనిపించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే రెండో సారి తల్లిదండ్రులవుతున్న విషయంపై కోహ్లి, అనుష్క ఇప్పటివరకు ఏ అధికారిక ప్రకటన చేయలేదు. కూతురు వామిక విషయంలోనూ విరుష్క ఎంతో ప్రైవసీతో ఉంటున్న విషయం తెలిసిందే. వామిక ఫొటోలు ఇప్పటివరకు బయటకు రానివ్వలేదు. విరాట్-అనుష్క 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2021లో కూతురు వామికాకు జన్మనిచ్చారు. మరోవైపు కోహ్లి ప్రపంచకప్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. వన్డేల్లో 49 సెంచరీలు బాదిన కోహ్లి సచిన్ అత్యధిక వన్డే సెంచరీల రికార్డును సమం చేశాడు.
220
previous post