ఒకే వేదికపై రాజమౌళి-మహేశ్‌

స్టార్‌ హీరో మహేష్ బాబు, స్టార్‌ డైరెక్టర్‌ రాజమౌళి ఒకే వేదికపై సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్‌ సినిమా.. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు వారిద్దరు చీఫ్‌ గెస్ట్‌లుగా వస్తున్నారు. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో సోమవారం సాయంత్రం ఈవెంట్ జరగనుంది. రాజమౌళి- మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్స్‌ దశలో ఉన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు వారిద్దరు ప్రత్యక్షంగా కలుసుకోబోతుండటంతో సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక ‘యానిమల్‌’ విషయానికొస్తే.. తండ్రి, కొడుకుల నేపథ్యంలో ఎమోషనల్‌ డ్రామాగా రూపొందింది. రష్మిక హీరోయిన్‌. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు విశేష ఆదరణ దక్కింది. అడ్వాన్స్‌ బుక్సింగ్స్‌లోనూ ఈ సినిమా హవా చూపించింది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం